భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం లో నిర్వహించనున్న బహిరంగ సభకు తరలిరావాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పిలుపునిచ్చారు. మోదీ పర్యటన సందర్బగా ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు చోడవరం నియోజకవర్గం ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మంగళవారం చోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కలిదిండి సూర్య నాగ సన్యాసిరాజుతో కలిసి కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.