మండపేటలో ఎప్పుడు లేని విధంగా వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేటలోని గొల్లపుంత వైయస్సార్ కాలనీలో మహిళా శక్తి సంఘం నిధులతో నిర్మించిన మహిళా భవనం శనివారం అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలకు మేలు చేసే కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు.