రాయవరం: తన ఇద్దరి పిల్లలను కాలువలో తోసేసిన కసాయి తండ్రి

57చూసినవారు
రాయవరం మండలం వెంటూరు గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పిల్లి రాజు అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను తీసుకుని రామచంద్రపురం మండలం పత్తిపాడు కోరంగి కెనాల్ లోకి తోసేసాడు. ఈ ఘటనలో బాలిక మృతి చెందగా బాలుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడని స్థానికులు తెలిపారు. అయితే తండ్రి రాజు జాడ తెలియలేదు. ఈ ఘటనపై ద్రాక్షారామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్