బుచ్చిబాబుకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలి

50చూసినవారు
బుచ్చిబాబుకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలి
ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన దాట్ల సుబ్బరాజుకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని నియోజకవర్గ టీడీపీ, జనసేన నాయకులు తీర్మానం చేశారు. ముమ్మిడివరం టీడీపీ కార్యాలయంలో టీడీపీ, జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సమావేశం నిర్వహించారు. బుచ్చిబాబుకు క్షత్రియ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కోరుతూ తీర్మానంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్