తాళ్లరేవు వాసవి క్లబ్ వారిచే గాంధీ జయంతి వేడుకలు

80చూసినవారు
తాళ్లరేవు వాసవి క్లబ్ వారిచే గాంధీ జయంతి వేడుకలు
జాతి పిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఉదయం 10 గంటలకు తాళ్లరేవు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ పిలుపు మేరకు 12000 సీడ్ బాల్స్ తయారు చేసి గ్రామ దేవత పరదేశమ్మ గుడి వద్ద మరియు తాళ్లరేవు బైపాస్ రోడ్ వద్ద జల్లడించారు. క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్