ముమ్మిడివరం మండలం ముమ్మిడివరంలో నగర పంచాయతీ కమిషనర్ రవివర్మ అధికారులతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. పట్టణ పరిధిలో ఇంటి నిర్మాణాలు మరియు వ్యాపార షెడ్డులనుషెడ్లను నిర్మించాలన్నా ముందుగా కార్యాలయం నుంచి ముందస్తు అనుమతులు పొంది సదరు నిర్మాణాలను ప్రారంభించాలని అన్నారు. సదరు అనుమతులు లేని నిర్మాణాలను వెంటనే నిలిపివేసి వాటిపై మునిసిపాలిటీ చట్టం-1965 ను అనుసరించి సదరు నిర్మాణాలను పూర్తిగా తొలగించాలని తెలిపారు.