ముమ్మిడివరం మండలం ముమ్మిడివరంలో ఒక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు శనివారం ఘనంగా జరిగాయి. సంస్కృతి సంప్రదాయాలను నేటితరం విద్యార్థుల కళ్లకు కట్టినట్టుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు ఆయురారోగ్యాలతో ఉండాలని సాంప్రదాయంగా వస్తున్న భోగిపల్ల కార్యక్రమము, భోగి మంటలు, ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు, పిండి వంటలు ఏర్పాటు చేశారు. చిన్నారుల కోలాటాలు పలువురిని ఆకట్టుకున్నాయి.