దిగబడిన ఏటిగట్టుకు మరమ్మత్తు

1562చూసినవారు
6 నెలల క్రితం కురిసిన వర్షాలకు కాట్రేనికోన మం. కుండలేశ్వరం వైరు వద్ద 60 మీటర్ల మేర ఏటిగట్టు పంట కాలువ వైపు దిగబడి ప్రమాదకరంగా మారింది. తాత్కాలిక పనులతో సరిపెట్టిన అధికారులు తీరిగ్గా 8 నెలల తర్వాత శనివారం గట్టు దిగబడిన చోట వెదురు తడకలు ఏర్పాటు చేసి కుంగిన ప్రదేశంలో ఇసుక నింపి మరమ్మత్తు పనులు చేపట్టారు. ఏటిగట్టు రోడ్డు ఆధునీకరణ పనులు నాసిరకంగా జరగడం వల్లే గట్టు కుంగిపోతుందని పలువురు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్