పెరవలి మండలం కాపవరం, కొత్తపల్లి అగ్రహారం గ్రామాలాల్లో వైసీపీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్‌నాయుడు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఐదేళ్లలో తమ కుటుంబాలకు కలిగిన సంక్షేమాన్ని సంతోషంగా చెబుతున్నారన్నారు. మా కోసం మా సిఎం జగన్ ఎన్నోసార్లు బటన్ నొక్కారని. మేము కూడా మే 13వ తేదీన జరగనున్న పోలింగ్‌లో రెండుసార్లు ఫ్యాన్ గుర్తుకు ఎదురుగా ఉన్న బటన్‌లను నొక్కి రుణం తీర్చుకుంటామని ఓటర్లు స్పష్టం చేశారన్నారు.