తూర్పుగోదావరి జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఎరువులను సరఫరా చేయాలని సూచించినట్లు తెలిపారు. జనవరి 10వ తేదీ లోపు 2500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు రంగం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.