విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో చికిత్స పొందుతూ ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన యజ్జవరపు ఆదిలక్ష్మి (42) తన కుమార్తె ప్రేమించి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఈనెల 19న విషం తాగారు. దీంతో రాజానగరం జీఎస్ఎల్ ఆసుపత్రికి తరలించగా వైద్యం పొందుతూ మరణించారు.