ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలోని రైతు సంఘ భవనంలో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు, త్వరలో జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పలు విషయాలను వివరించారు. అనంతరం నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.