ఏజెన్సీ, డెల్టా, మెట్ట ప్రాంతాలకు ముఖ ద్వారమైన నిడదవోలు రైల్వే జంక్షన్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కు హాల్ట్ సదుపాయం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. చిన్నపాటి స్టేషన్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్కు హాల్ట్ ఉందనివ, ఎంతో ప్రధానమైన నిడదవోలు జంక్షన్‌లో లేకపోవడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. పగలు హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.