2025 సంవత్సరం ప్రతి కుటుంబంలో ఆనందోత్సవాలు వెల్లు విరవాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆకాంక్షించారు. బుధవారం పెద్దాపురంలో కార్యాలయంలో మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గం ప్రజలకు, కూటమి నాయకులు, కార్యకర్తలకు, టీడీపీ కుటుంబసభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం అంతా చంద్రబాబు హయాంలో అంతా మంచే జరిగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.