యు. కొత్తపల్లి తీరప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే వర్మ శనివారం పర్యటించి మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఎగిసిపడి వాటి ప్రభావం వలన సుమారు 30 మంది మత్స్యకార ఇళ్ళు కూలిపొయాయి. అలాగే సూరడపేటలో కెరటాల ఉద్ధృతికి అంగన్ వాడీ భవనం కుప్పకూలింది. విషయం తెలుసుకున్న వర్మ ఆయా ప్రాంతాలలో పర్యటించి బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.