కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభా వేదిక వద్దకు జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. జయకేతనం పేరిట నిర్వహిస్తున్న ఈ సభకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ రాకతో సభ ప్రాంగణమంతా ఒక్కసారిగా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.