జగన్ మోహన్ రెడ్డి పిచ్చితుగ్లక్ నిర్ణయంతోనే గొల్లప్రోలుతో పాటు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు వరద కష్టాలు వచ్చి పడ్డాయని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుద్దగడ్డ వరదల కారణంగా గొల్లప్రోలు వద్ద ముంపునకు గురైన పంటపొలాలను ఆయన మంగళవారం పరిశీలించారు. పొలాల్లోకి దిగి కుళ్లి పోతున్న వరి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.