పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకినాడ మాజీ ఎంపీ వంగా గీత హాజరై దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. తండ్రి బాటలో పేదలకు అండగా నిలిచిన తనయుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు.