ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి అనంతపూర్ వాస్తవ్యులు జీ నరసింహమూర్తి రు 1, 00, 116/- విరాళంగా దేవస్థాన పిఆర్ఓ విభాగం గణపతి కి అందజేశారు. దీనిపై వచ్చే వడ్డీతో ది 01-12-2024 తేదీన పేరు మీద నరసింహమూర్తి, శ్రీలత, కార్తికేయ, అఖిల పేరు మీద అన్నదానం జరిపించాలని దాతకోటినారు. దేవస్థానo అధికారులు దాతను అభినందించారు.