ఏలేశ్వరంలో ఏలేరు రిజర్వాయర్‌లో తగ్గిన నీరు

57చూసినవారు
ఏలేశ్వరం సమీపంలో ఉన్న ఏలేరు రిజర్వాయర్‌లో నీరు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో సరైన వర్షాలు కురవకపోవడంతో నీరు చేరలేదని రైతులు తెలిపారు. గరిష్ట నీటి మట్టం 22 టిఎంసిలు కాగా నేడు 3 టిఎంసిలు మాత్రమే ఉంది. ఈ రిజర్వాయర్ ద్వారా ఏలేశ్వరం, ప్రత్తిపాడు, కోటనందూరు, శంఖవరం మండలాల్లో వేలాది ఎకరాలకు నీరు అందించవలసి ఉంది. వరుణుడు కరుణించాలని రైతులు వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్