మారుతున్న కాలానికి అనుగుణంగా యువత సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పైల సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ మేరకు ఇటీవల ఇస్రో శిక్షణకు ఎంపికైన ఏలేశ్వరంకు చెందిన స్పార్క్ ఫౌండేషన్ బృందాన్ని ఆయన బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇస్రోకు రాష్ట్రం నుంచి మొట్టమొదటిసారి ఎంపికైన స్పార్క్ ఫౌండేషన్ బృందం సభ్యుల కృషిని కొనియాడారు.