కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో దళిత వ్యతిరేక పాలన సాగిస్తుందని మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం రాజమండ్రిలో మీడియాతో ఆయన మాట్లాడారు. మండపేట మండలంలోని ద్వారపూడిలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటును టీడీపీ, జనసేన, వైసీపీ వారు ఏకమై వ్యతిరేకిస్తున్నారని అన్నారు. దళితుల పట్ల అణచివేత ధోరణితో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇదేనా ప్రజాస్వామ్య పాలన అని సీఎం చంద్రబాబును ఆయన ప్రశ్నించారు.