మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పై బైండోవర్ కేసు నమోదు

68చూసినవారు
మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పై బొమ్మూరు పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ హర్షకుమార్ శుక్రవారం ద్వారంపూడిలో అంబేడ్కర్ విగ్రహం ఘటనకు సంబంధించి బాధితులను పరామర్శించేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. స్థానిక జే. ఎన్ రోడ్డు శివారు జాతీయ రహదారిపైకి వచ్చే సరికి ఆయన వాహనాన్ని సెంట్రల్ జోన్ ట్రాఫిక్ డీఎస్పీలు రమేష్ బాబు తమ సిబ్బందితో అడ్డుకున్నారు. ఈ క్రమంలో హర్ష కుమార్ పై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్