రాజమండ్రిలో దంచికొడుతున్న భారీ వర్షం

61చూసినవారు
రాజమండ్రి నగరంలో బుధవారం‌ ఉదయం నుంచి భారీ వర్షం దంచికొడుతుంది. సుమారు మూడు గంటలుగా ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి రహదారులు, పలు వీధులు ముంపునకు గురయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా డ్రైన్ వాటర్ రహదారులపైకి చేరడంతో మురుగునీటితో దుర్వాసన వెదజల్లుతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్