మాజీ సిఎం జగన్ తిరుమల పర్యటనపై రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి బుధవారం చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ‘28న తిరుమలకు వెళ్తున్న జగన్ టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. జగన్ అన్య మతస్తులు కావడంతో (జీవో ఎంఎస్ నం. 311) ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా’ అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.