ముస్లింలు పవిత్రంగా నిర్వహించే రంజాన్ ఉపవాస దీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా 30 రోజులు కటిన ఉపవాస దీక్షలను పాటిస్తారు. ప్రతి రోజు ఉదయం సహరితో ప్రారంభమై సాయంత్రం ఇఫ్తార్తో దీక్షలు ముగుస్తాయి. రంజాన్ ఉపవాస దీక్షల కోసం మామిడికుదురు, నగరం, కొమరాడ, మగటపల్లి, మొగలికుదురు, పెదపట్నం గ్రామాల్లోని మసీదులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. విద్యుత్ దీపాల కాంతులతో వాటిని తీర్చిదిద్దారు.