పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి తూ. గో జిల్లాలో వారాంతంలో ప్రముఖ ఆధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒకరోజు టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేశామని మంత్రి కందుల దుర్గేశ్ శుక్రవారం తెలిపారు. రేపటినుంచి ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుడుతున్నామన్నారు. రాజమండ్రి సరస్వతి ఘాట్ వద్ద శనివారం ఉదయం 6 గంటలకు బస్సులు ప్రారంభమవుతాయని తెలిపారు. పెద్దవాళ్లకు రూ. 1000, చిన్నారులకు రూ. 800 ఛార్జ్ ఉంటుందన్నారు.