2024 ఎన్నికలలో ఎన్డీఏ కూటమి గెలుపుకు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు సముచిత స్థానం ఇస్తామని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. శుక్రవారం రాజమండ్రి రూరల్ మండలంలోని కొంతమూరు గ్రామంలో నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో రూ. 50 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.