రాజమండ్రి: అంగన్వాడి, హెల్త్ సెంటర్లను పరిశీలించిన ఎమ్మెల్సీ

69చూసినవారు
రాజమండ్రిలోని 13వ వార్డులో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పౌష్టికాహారం, పాలు, గుడ్లు బాలామృతం, బాలింతలకు ఇచ్చే వస్తువులను పరిశీలించి నాణ్యత పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ని సందర్శించి వైద్యులతో మాట్లాడి సదుపాయాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్