రాజమండ్రి రూరల్: కల్వర్టు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

82చూసినవారు
రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలో నూతన కల్వర్టు నిర్మాణానికి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 15వ ఆర్ధిక సంఘం నిధుల ద్వారా రూ. కోటి ముప్పై ఏడు లక్షలతో కల్వర్టు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్