కోరుకొండ గ్రామ సర్పంచ్ కర్రి లక్ష్మి సరోజ, వీర గణేష్ శుక్రవారం జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి రాజానగరం ఎమ్మెల్యే భక్తులు బలరామకృష్ణ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుందని నమ్మకంతో పార్టీలోకి చేరినట్లు చెప్పారు.