కూటమి ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాముఖ్యతనిస్తూ, ఉన్నత విద్యకు బడ్జెట్ లో రూ. 2, 326 కోట్లు కేటాయించామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురంలో చింతపల్లి సూరన్న నగర్ లోని ఇందిరాగాంధీ మున్సిపల్ హైస్కూల్ ను మంత్రి సుభాష్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ హైస్కూల్ ప్రాంగణాన్ని నిశితంగా పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు.