స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని రామచంద్రపురం పట్టణంలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి సుభాష్ మాట్లాడుతూ రక్తదానం ద్వారా ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టిన వారు అవుతారని అభినందించారు.