ప్రధాన రహదారులపై దుకాణాలు ఉంచి ట్రాఫిక్ సమస్య సృష్టించకుండా ఆ దుకాణాలను మార్కెట్లోకి తరలించాలని రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ అన్నారు. శనివారం గంగవరం వారపు సంత ఆమె పరిశీలించారు. వచ్చేవారం నుంచి అన్ని దుకాణాలు మార్కెట్లోని షెడ్లలో ఏర్పాటు చేసుకోవాలన్నారు. వారపు సంతలో దుకాణదారులు విక్రయించే అన్ని రకాల వస్తువులు తినుబండారాలను నాణ్యతపై తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.