రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషదేవి భర్త భాస్కర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని యువతను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆరోపించారు. రంపచోడవరంలో ఆమె గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగం ఇప్పిస్తానని
మోసం చేసిన ఒక బాధితురాలి ఫోన్ వాయిస్ రికార్డింగ్ను ఆమె మీడియాకు వినిపించారు. డబ్బులు ఫోన్ పే ద్వారా వసూలు చేసిన స్క్రీన్ షాట్స్్న కూడా చూపించారు. షాడో ఎమ్మెల్యేగా వ్యవహారిస్తున్నారని ఆమె ఆరోపించారు.