ఆత్రేయపురంలో హెల్మెట్ వినియోగంపై డీఎస్పీ గోవిందరావు ఆదేశాల మేరకు వాహనదారులకు ఆదివారం ఎస్ఐ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్. విద్యాసాగర్, ఎస్ఐ ఎస్. రాము కలిసి ఆత్రేయపురం సెంటర్ నందు వాహనదారులకు సూచనలు ఇచ్చారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణాంతకమని తెలియజేశారు.