డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం చింతలమోరి గ్రామం వడ్లపాలెంలో బిలీవర్స్ ఫౌండేషన్ సేవా సంస్థ
యొక్క 7వ వార్షికోత్సవ వేడుకలు చింతలమోరి జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓగూరి మనోహర్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగాయి. బిలీవర్స్ ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా ప్రతి నెల జరిగే సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 50 మంది వృద్ధులకు 200 రూపాయలు చొప్పున అందజేయడం జరుగుతుంది అన్నారు.