మామిడికుదురు మండలంలో భారీ వర్షం

78చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బుధవారం మామిడికుదురు మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దట్టమైన మేఘాలు, భీకరమైన ఉరుములతో భారీ వర్షం కురవడంతో రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మండల పరిధిలోని 18 గ్రామాల్లోనూ భారీ వర్షం కురిసింది. 216వ నెంబర్ జాతీయ రహదారిపై వర్షం నీరు భారీగా నిలిచి పోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్