ఈ నెల 27న జాబ్ మేళా

53చూసినవారు
ఈ నెల 27వ తేదీన పి. గన్నవరం గ్రేస్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను వినియోగించుకోవాలని కోరుతూ మామిడికుదురు మండలంలో మైకు ద్వారా బుధవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలోని ప్రతి గ్రామంలోనూ జాబ్ మేళాపై ప్రచారం నిర్వహించారు. పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మేళా ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్