ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏ వేమా సూచించారు. మలికిపురం మండలం మలికిపురంలో గురువారం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ. బీజేపీ విధానాలను ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. మండల శాఖ అధ్యక్షులు కనకేశ్వరరావు, పార్టీ నేతలు పాల్గొన్నారు.