మామిడికుదురు మండలం మగటపల్లిలో రెండవ రోజు బుధవారం కూడా రికార్డింగ్ డాన్స్ జోరుగా సాగింది. ఈ గ్రామంలో రెండు చోట్ల కోడి పందేలు, గుండాటల బరులు ఏర్పాటు చేశారు. ఆ రెండు చోట్ల రికార్డింగ్ డాన్సులు కూడా ఏర్పాటు చేయడంతో జనం ఎగబడ్డారు. ఆదుర్రు, ఈదరాడ, గోగన్నమఠం గ్రామాల్లో కూడా రికార్డింగ్ డాన్స్ లు ఏర్పాటు చేశారు. రికార్డింగ్ డాన్సుల పేరట అశ్లీల నృత్యాలు నిర్వహించారు.