ఇసుక కొరతను తీర్చాలంటూ కార్మికుల ఆందోళన

69చూసినవారు
ఇసుక అందుబాటులో లేక ఉపాధి కోల్పోయామని భవన నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్ యజమానులు శుక్రవారం ఆందోళన తెలిపారు. మలికిపురంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కు వినతి పత్రం ఇచ్చారు. ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును గత ప్రభుత్వం బ్రష్టు పట్టించిందని ఎమ్మెల్యే వరప్రసాద్ పేర్కొన్నారు. దాన్ని పునరుద్ధరించామన్నారు. ఇసుక సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్