తొండంగి మండలం వాకదారిపేట గ్రామానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అందజేశారు. తుని మండలం తేటగుంట టీడీపీ కార్యాలయంలో రూ. 1, 05, 027 చెక్కును సోమవారం బుద్ధి దుర్గకు అందజేశారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేశ్, సుర్ల లోవ రాజు, మోతుకూరి వెంకటేశ్, కొయ్య కేశవ, కొయ్య సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.