కోటనందూరు మండలం కొత్తకొట్టాం గ్రామానికి చెందిన అడిగర్ల సత్తిబాబు వైయస్సార్ భీమా పథకంలో సభ్యులుగా ఉండి అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. వైయస్సార్ భీమా పథకం ద్వారా లక్ష రూపాయలకు అర్హులుగా గుర్తించి దహన ఖర్చుల నిమిత్తం గురువారం 10 వేల రూపాయలను భార్య మంగకు గ్రామ సర్పంచ్ దొగ్గా లక్ష్మీబాబులు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.