వైసీపీ సీనియర్ నాయకులు, లోవ దేవస్థానం మాజీ చైర్మన్ లాలం బాబ్జీ జన్మదిన వేడుకలు కే.ఈ చిన్నయ్యపాలెంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, వైసీపీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, కోటనందూరు ఎంపీపీ లగుడు శ్రీను, కొత్తకొట్టాం గ్రామ సర్పంచ్ దొగ్గా బాబులు, మండలంలోని పలువురు అధికార, రాజకీయ ప్రముఖులు బాబ్జీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.