జలజీవన్ మిషన్ ద్వారా రూ.19 కోట్లు మంజూరు

536చూసినవారు
జలజీవన్ మిషన్ ద్వారా రూ.19 కోట్లు మంజూరు
కాకినాడ జిల్లా కోటనందూరు మండలానికి ప్రజల దాహార్తి తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి భాగస్వామ్యంతో తలపెట్టిన ఇంటింటికి కుళాయి లో భాగంగా జల జీవన్ మిషన్ ద్వారా మండలానికి 19 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని, దీని ద్వారా మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలకు ఇంటి కుళాయి కనెక్షన్ లు ఇచ్చేందుకు ఇప్పుడు ఉన్న వాటర్ ట్యాంకు లకు అదనంగా కొత్త వాటర్ ట్యాంకులు నిర్మాణం చేపట్టి మండల ప్రజలు వేసవిలో నీటి ఎద్దడి నుండి బయట పడడానికి అవకాశం ఉంటుందని మండల ఎంపీపీ లగుడు శ్రీనివాస్ అన్నారు. ముందుగా బిళ్ళనందూరు గ్రామపంచాయతీ శివారు బంగారయ్య పేట గ్రామము లో శుక్రవారం శంకుస్థాపన చేసి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొత్స మంగ సత్యనారాయణ, ఉప సర్పంచ్ చందక రమణ, వై ఎస్ ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్