మలికిపురం: అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్ అందించాలి
రాష్ట్రంలో అర్హత కలిగిన వారందరికీ పెన్షన్ అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణం రాజు ప్రభుత్వాన్ని కోరారు. మలికిపురం మండలం లక్కవరంలో సోమవారం ఆయన మాట్లాడారు. 2025 జనవరి నుంచి అర్హత కలిగిన లబ్ధిదారులకు పెన్షన్లు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులు మూడు నెలలకోసారి పెన్షన్ తీసుకోవచ్చని చెప్పడం హర్షించదగ్గ విషయమన్నారు.