తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరుతూ శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఎస్ఎస్ఎ ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వనపర్తి నల్లచెరువు జమ్మిచెట్టు వద్ద నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేశారు. జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ. సీఎం ఇచ్చిన హామీ అమలు చేయాలని, ఎస్ఎస్ఎ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఎస్ఎస్ఎ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలన్నారు. డిఈఓ ఆఫీస్ సిబ్బంది, కేజీబీవీ ఉద్యోగులు పాల్గొన్నారు.