మండపేట: డాక్టర్ ఎల్లా ప్రగడ పేరు ప్రతిపాదన అభినందనీయం
ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల పేరును డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు ప్రభుత్వ వైద్య కళాశాలగా ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమని పియంపి అసోసియేషన్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కోన సత్యనారాయణ అన్నారు. మండపేటలో శనివారం సత్యనారాయణ మాట్లాడుతూ డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు పేరు ప్రతిపాదించిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.