కేఏమల్లవరంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో కేఏ మల్లవరంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య హాజరై ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకెళ్లారు. ఇంటింటికీ ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటిస్తూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతకుమందు గ్రామస్తులు ఎమ్మెల్యేకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.